ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత పి.చిదంబరం డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వీరు ఇకపై ఆయా పదవుల్లో కొనసాగడానికి అర్హత కోల్పోయారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
కాంగ్రెస్ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకం 'న్యాయ్'ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్ విమర్శించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంపై ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది.