భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే నియమితులు కానున్నారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. జస్టిస్ బోబ్డే నవంబర్ 18న సుప్రీంకోర్టు 47వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకు 17 నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి ఈ ఏడాది నవంబర్ 17న పదవీ విరమణ చేస్తారు.
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డేను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ బోబ్డే నవంబర్ 18న సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు.
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే