తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సర్కార్ రవాణా డొల్ల - ప్రభుత్వ రవాణా

ఓలా సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రభుత్వ రవాణాపై మహిళలు అపనమ్మకంతో ఉన్నారని తేలింది.

రవాణా వ్యవస్థ

By

Published : Mar 8, 2019, 12:01 AM IST

ప్రభుత్వ రవాణా మహిళలకు భరోసా కల్పించడం లేదని ఓ సర్వే చెబుతోంది. కేవలం 9 శాతం మహిళలే ప్రభుత్వ రవాణా సురక్షితం అని చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఓలా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 9 శాతం మహిళలు, 11 శాతం పురుషులు మాత్రమే ప్రభుత్వ రవాణా సురక్షితం అని నమ్ముతున్నారు. అందుకు గల కారణాలు మహిళలపై వేధింపులేనని తెలుస్తోంది.

రవాణా వ్యవస్థ గురించి ఓలా ఓ సర్వే నిర్వహించింది. అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై, ఇండోర్, జమ్ము కశ్మీర్, ముంబయి, మైసూర్, దిల్లీలోని 9,935 మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. రాత్రి పూట మినహాయించితే మిగతా రోజులో సురక్షితమే అని 35 శాతం మంది పురుషులు, మహిళలు తెలిపారు.

38 శాతం మంది బస్​లు, 35 శాతం మెట్రోలో, రైళ్లలో, 40-45 శాతం ఆటో రిక్షాలు, టాక్సీలలో ప్రయాణిస్తున్నారని తేలింది.

ప్రభుత్వ రవాణా వ్యవస్థ సమాచారాన్ని మరింత సంస్కరించాలని 89 శాతం మహిళలు ఆశిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details