కొద్దివారాల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు రొట్టెలు, కూరతో కూడిన పోషకాహారానికి బదులుగా రొట్టెలు-ఉప్పు అందించారు. ఈ వీడియో చిత్రీకరించిన స్థానిక జర్నలిస్టు జైస్వాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్త రాసిన జర్నలిస్టు రాష్ట్ర ప్రభుత్వ కీర్తిని అప్రతిష్టపాలు చెయ్యడానికి అసత్య ప్రచారం చేశారని స్థానిక అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జైస్వాల్‌పై ఫిర్యాదు
జర్నలిస్ట్ పవన్ జైస్వాల్‌పై స్థానిక కలెక్టర్ ఆదేశాలమేరకు మీర్జాపూర్ బ్లాక్ విద్యాశాఖాధికారి ప్రేమ్ శంకర్ రామ్.. అరూరా పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షియుర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో రొట్టెలను వండారని... కానీ అందులోకి కూరలు వండలేదని, కావాల్సిన ఏర్పాట్లు చెయ్యాల్సింది మానేసి గ్రామ సర్పంచ్ అనుచరుడు రాజ్‌కుమార్ పాల్... జర్నలిస్ట్ పవన్‌ను పిలిపించి కుట్రపూరితంగా వీడియో తీయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి జైస్వాల్‌పై నేరపూరిత కుట్ర, మోసం కింద పవన్ కేసు నమోదు చేశారు.
వార్త సృష్టించింది కాదు
ఈ వార్త ఉద్దేశపూర్వకంగా తీసింది కాదని, ఒకసారి వార్తను చూసి నిర్ధరణ చేసుకోవాలని జైస్వాల్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రతి విషయాన్ని అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
వీడియోలో ఏముంది?