తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగ్గురు జైషే ఉగ్రవాదుల అరెస్టు - terrorists

జమ్ముకశ్మీర్  శ్రీనగర్​లోని చనాపొర పోలీస్ పోస్ట్​పై శుక్రవారం దాడులు చేసిన ముగ్గురు ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

ముగ్గురు జైషే ఉగ్రవాదుల అరెస్టు

By

Published : Apr 28, 2019, 8:11 PM IST

జమ్ముకశ్మీర్​ పోలీసులు ముగ్గురు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. నిందితులు శుక్రవారం పోలీస్ పోస్ట్​పై దాడులు చేసిన ముస్తాక్, జునైద్, లతీఫ్​గా గుర్తించారు. వీరివద్దనుంచి ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్లు, ఆరు తూటాలను స్వాధీనం చేసుకున్నారు.

దాడి చేశారిలా...

నిందితుల్లో ఒకడు పాస్​పోర్ట్ వెరిఫికేషన్ పేరుతో పోలీస్​స్టేషన్​లోకి ప్రవేశించాడు. సెంట్రీ తప్ప ఎవరూ లేరని గుర్తించాడు. అనంతరం తన తోటి వారిని అప్రమత్తం చేసి తన వెంట తీసుకొచ్చాడు. వారిలో ఒకరు హెల్మెట్ ధరించి ఉండటం గమనించిన సెంట్రీ... వారిని చెక్ చేసేందుకు వీలుగా తొలగించమని కోరాడు. వెంటనే ఆ ఉగ్రవాది కాల్పులు ప్రారంభించాడు. నిందితులు సెంట్రీ వద్ద ఉన్న తుపాకిని లాక్కునేందుకు విఫలయత్నం చేశారు. ఉగ్రవాదులు బుద్గాం జిల్లాకు చెందినవారని సమాచారం.

ఇదీ చూడండి: పదేళ్లలో 5రెట్లు పెరిగిన రైల్వే చోరీలు

ABOUT THE AUTHOR

...view details