జమ్ముకశ్మీర్‌లో మంచు భారీగా కురుస్తోంది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంచు చరియలు విరిగిపడి ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న తంగ్ధార్ సెక్టార్ జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
"తంగ్ధార్కు మేం బుధవారమే చేరుకున్నాం. ముగ్గురు సైనికులపై మంచు చరియలు విరిగిపడ్డాయి. గాయాలతో ఉన్న వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాము. కానీ, దురదృష్టవశాత్తు నిఖిల్ శర్మ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. "
- సైనికాధికారులు
ప్రయాణానికి ఇబ్బందులు..
మంచు రక్కసి బీభత్సం-జవాన్ మృతి
జమ్ముకశ్మీర్‌లో భారీగా కురుస్తోన్న మంచుతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మంచును తొలగిస్తూ.. రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పలు చోట్ల వన్-వే ట్రాఫిక్‌ను అందుబాటులోకి తెచ్చారు. పూంచ్‌లోని షోపియాన్ నుంచి బఫిలాజ్ వెళ్లే మార్గాన్ని ప్రయాణించేందుకు అనువుగా మార్చారు.
పిర్ పంజాల్ కనుమ ప్రాంతంలో మూడు రోజులుగా అధికంగా మంచు కురుస్తోందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగమే: అమిత్ షా