తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2019, 5:01 AM IST

Updated : Oct 8, 2019, 7:15 AM IST

ETV Bharat / bharat

కశ్మీర్​ పర్యటనకు గ్రీన్​ సిగ్నల్- గురువారం నుంచి షురూ!

కశ్మీర్​ సందర్శనను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 10 నుంచి పర్యటకులు కశ్మీర్​ను సందర్శించేందుకు అనుమతించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రెండు నెలల ముందు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది.

కశ్మీర్​ పర్యటనకు గ్రీన్​ సిగ్నల్- గురువారం నుంచి షురు!

రెండు నెలలుగా ఆంక్షలు, ఉద్రిక్తతలు, కర్ఫ్యూతో స్తంభించిన కశ్మీర్​కు తిరిగి పర్యటక శోభ సంతరించుకోనుంది. ఉగ్ర ముప్పుతో కశ్మీర్​ను విడిచివెళ్లిపోవాలని పర్యటకులకు జారీ చేసిన అత్యవసర ఆదేశాలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి కశ్మీర్​లో పర్యటకులను అనుమతించనుంది. ఈ మేరకు జమ్ముకశ్మీర్​ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 370ని కేంద్రం ఆగస్టు 5న రద్దు చేసింది. అందుకు కొన్ని రోజుల ముందే (ఆగస్టు 2) జమ్ముకశ్మీర్ పర్యటనపై ఆంక్షలు విధించింది.

కశ్మీర్​లోని తాజా పరిస్థితులు- భద్రతా పరిణామాలను సమీక్షించేందుకు జరిగిన సమావేశంలో మాలిక్​ ఈ మార్గనిర్దేశకాలను జారీ చేశారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలపైనాఈ సమావేశంలో గవర్నర్​తో చర్చించారు అధికారులు.

ఆగస్టు 5 నుంచి ప్రతి రోజు రెండు గంటలపాటు ఈ తరహా సమావేశాలు నిర్వహిస్తున్నారు గవర్నర్​. విద్యాసంస్థల పునఃప్రారంభం, రవాణా వ్యవస్థ పునరుద్ధరణ తదితర కీలక నిర్ణయాలను ఈ సమావేశాల్లోనే తీసుకున్నారు.

ఇదీ చూడండి:- మెహబూబా ముఫ్తీతో పార్టీ నేతల భేటీకి అనుమతి

Last Updated : Oct 8, 2019, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details