జమ్ముకశ్మీర్ పుల్వామా లోని అవంతిపొరలో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. శనివారం ఉదయం 2.10 నిమిషాలకు ప్రారంభమైన ఎన్కౌంటర్ 9 గంటల పాటు కొనసాగింది.
పుల్వామాలో ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లా అవంతిపొరలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉద్రవాదులు హతమయ్యారు. శనివారం వేకువజామున ప్రారంభమైన ఆపరేషన్ 9 గంటల పాటు కొనసాగింది.
జమ్ము ఎన్కౌంటర్: పుల్వామాలో భద్రత కట్టుదిట్టం
అవంతిపొరలోని పంజ్గామ్లో తనిఖీలు చేస్తున్న బలగాలపై ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు ఎదురుకాల్పులు చేశారు. ముందుగా ఇద్దరు ముష్కరులను హతమార్చిన బలగాలు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం మరి కొన్ని గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. మిగిలి ఉన్న ఉగ్రవాది సైతం బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ చూడండి- WC19: అనుమానాస్పద మృతి- ఇప్పటికీ ఓ మిస్టరీ
Last Updated : May 18, 2019, 1:01 PM IST