తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జార్ఖండ్​: నక్సల్స్ కాల్పుల్లో జవాను మృతి - ఎదురుకాల్పులు

జార్ఖండ్​లో నక్సల్స్, పోలీసుల మధ్య ఎన్​కౌంటర్ జరిగింది. ఘటనలో ఒక జవాను మృతి చెందారు. మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. నలుగురైదుగురు నక్సల్స్ హతమైనట్లు సమాచారం ఉందని ఎస్పీ రమేశ్ వెల్లడించారు.

జార్ఖండ్​లో ఎదురుకాల్పులు-జవాను మృతి

By

Published : Jun 2, 2019, 8:51 AM IST

Updated : Jun 2, 2019, 9:38 AM IST

జార్ఖండ్​లోని డుమ్కాలో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సశస్త్ర సీమా బల్​ జవాను ఒకరు మృతి చెందారు. మరో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. కాల్పుల్లో నలుగురు నుంచి ఐదుగురు నక్సల్స్ మృతి చెంది ఉంటారని సమాచారం అందిందని ఎస్పీ రమేశ్ తెలిపారు.

తెల్లవారు జాము 3.30 తల్​దంగల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా నక్సల్స్ కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు దీటుగా సమాధానమిచ్చాయి.

గాయపడిన జవాన్లలో ముగ్గురిని చికిత్స కోసం డుమ్కా ఆసుపత్రికి, మరొకరిని రాంచీకి తరలించారు.

జార్ఖండ్​లో ఎదురుకాల్పులు-జవాను మృతి
Last Updated : Jun 2, 2019, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details