తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు ఝార్ఖండ్​లో రెండో విడత పోలింగ్​.. బరిలో ప్రముఖులు - jharkhand assembly news

ఝార్ఖండ్​ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్ నేడు జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్​ దాస్​, శాసనసభ స్పీకర్ దినేష్​ ఓరాన్​ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. 47 లక్షల మంది ఓటర్లు పోలింగ్​లో పాల్గొననున్నారు.

jharkhand elections
నేడు ఝార్ఖండ్​లో రెండో విడత పోలింగ్​.. బరిలో ప్రముఖులు

By

Published : Dec 7, 2019, 5:11 AM IST

ఝార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్​లో భాగంగా 20 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్‌ జరగనుంది. 260 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 47లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఎన్నికల కోసం 42వేల మందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 18 స్థానాల్లో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు జరగనుంది. మరో రెండు స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది.

బరిలో ప్రముఖులు..

ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌, శాసనసభ స్పీకర్‌ దినేష్‌ ఓరాన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ గిలువా వంటి ప్రముఖులు రెండోవిడత ఎన్నికల బరిలో ఉన్నారు. రఘుబర్‌ దాస్‌.. జమ్‌షెడ్ పూర్‌ తూర్పు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ఝార్ఖండ్​ తొలి విడతలో నవంబర్ 30న 13 స్థానాలకు పోలింగ్ జరిగింది. చివరి విడత ఈనెల 20న జరగనుంది. 23న ఫలితాలు వెలువడుతాయి.

ఇదీ చూడండి: ఉన్నావ్​ ఘటన బాధితురాలు మృతి

ABOUT THE AUTHOR

...view details