ఎన్డీఏ భాగస్వామ్యపక్షం జేడీయూ నూతన మంత్రివర్గంలో చేరకూడదని నిర్ణయించుకుంది. భాజపా ప్రతిపాదించిన మంత్రి పదవుల సంఖ్య... తమ పార్టీకి ఆమోదయోగ్యం కానందునే మంత్రివర్గంలో చేరడం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.
"మేము కేంద్రప్రభుత్వంలో చేరడం లేదు. ఇది మా నిర్ణయం."
- పవన్ కుమార్ వర్మ, జేడీయూ ప్రధాన కార్యదర్శి
భాజపా అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయిన జేడీయూ అధినేత నితీష్‌కుమార్... తమకు రెండు కేబినెట్ పదవులు కావాలని కోరారు. అయితే... ఒక కేబినెట్ పదవి మాత్రమే ఇస్తామని షా స్పష్టం చేశారు. ఈ పరిణామంతో నూతన మంత్రివర్గంలో చేరకూడదని జేడీయూ నిర్ణయించుకుంది.