తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉగ్రవాదాన్ని అంతం చేయాలి'

ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్​ జవాన్ మోహన్​లాల్​ కుటుంబం కోరుతోంది. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని పిలుపునిచ్చింది. అమరజవాన్ మోహన్​లాల్ కుటుంబసభ్యులను ఈటీవీ భారత్​ ప్రతినిధి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.

శంకర్​ రాటూరి

By

Published : Mar 7, 2019, 11:32 PM IST

పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్​ మోహన్​లాల్ రాటూరి కుటుంబం బాలాకోట్ వాయుదాడులపై స్పందించింది. ఇది సరిపోదని, పూర్తిగా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలని కోరారు మోహన్ కుటుంబసభ్యులు. అదే తమ తండ్రి మరణానికి అసలైన నివాళి అంటూ రాటూరి పిల్లలు తమ మనోగతాన్ని ఈటీవీ భారత్​ ప్రతినిధికి వినిపించారు.

జవాను కుటుంబం

ప్రశ్న: వాయుదాడులతో పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకున్నామని మోదీ ప్రభుత్వం చెబుతోంది. మీరేమంటారు?
జ​:ఒక్క వాయుదాడితో ప్రతీకారం తీర్చుకున్నట్లు కాదు. మొత్తం ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టినప్పుడే అమర జవాన్లకు నిజమైన నివాళి.

ప్రశ్న: ఉగ్రదాడులను రాజకీయ పార్టీలు వివాదాస్పదం చేస్తున్నాయి. వాటిని ఎలా చూస్తున్నారు?
జ​:ఇటువంటి పరిస్థితులను రాజకీయంగా వాడుకోవటం అనేది ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు.

ప్రశ్న: వాయుదాడితో మీ తండ్రి మరణానికి ప్రతీకారం తీరినట్టేనా? మీరు ఇంకేమైనా కోరుకుంటున్నారా?
జ: ఉగ్రవాదులది ఎంతో పెద్ద సముదాయం. దీనితోనే పూర్తయినట్టు కాదు. ఎంతో కొంత వారి సంఖ్య తగ్గుతుంది. మొన్న దాడుల్లో 300 మంది మరణించారని అంటున్నారు. ఈ సంఖ్య ఒక్క శాతం ఉండొచ్చు. ఇలాగే భారత్​ దాడులు చేస్తుంటే ఉగ్రవాదం నశించే అవకాశం ఉంది.

ప్రశ్న: ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను రాజకీయంగా వాడుకుంటున్నారు. మీకేమనిపిస్తోంది?
జ:రాజకీయ ప్రభావం ఉన్నా లేకున్నా ఫర్వాలేదు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజల మనోభావాలను రాజకీయం చేయటమనేది సహించలేం.

ప్రశ్న:మోదీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు?
జ: ఈ విషయంలో మోదీ పనితీరు బాగుంది. సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సీఆర్పీఎఫ్​ డీఐజీ లాంటి వాళ్లు సైతం అప్పుడప్పుడు వచ్చి మా యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details