తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు నెహ్రూ 55వ వర్ధంతి-నేతల ఘన నివాళి

భారత ప్రథమ ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ, యూపీఏ ఛైర్​పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ నివాళులర్పించారు.

By

Published : May 27, 2019, 12:09 PM IST

Updated : May 27, 2019, 12:47 PM IST

నేడు నెహ్రూ 55వ వర్థంతి-నేతల ఘన నివాళి

జవహర్​లాల్ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి స్థలం శాంతి వనం వద్దకు నేతల తాకిడి పెరిగింది. పలువురు రాజకీయ నేతలు ఆయనకు నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్, రాజ్యసభలో విపక్షనేత గులాం నబీ ఆజాద్ నెహ్రూకు నివాళులర్పించారు.

"ఆ రోజుల్లో భారత్​ వంటి యవ్వన దేశాలు అతి తక్కువ కాలంలోనే నియంతృత్వంలోకి జారిపోయాయి. జవహర్​ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా... దృఢమైన, స్వతంత్ర, ఆధునిక ప్రజాస్వామ్య భారత్.. 70 ఏళ్లకు పైగా కొనసాగుతుండటంలో.. ఆయన పాత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది."

-ట్విట్టర్​లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

ప్రముఖుల ట్వీట్లు

ప్రధాని...

పండిట్ జవహర్​లాల్ నెహ్రూకు నివాళులు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.

ఉపరాష్ట్రపతి...

నవ భారత నిర్మాణానికి నెహ్రూ చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు నివాళులు.

రాజ్​నాథ్ సింగ్...

జవహర్​లాల్ నెహ్రూ భారత్​కు, సమాజానికి చేసిన సేవలు విస్మరించలేనివి. జవహర్​కు నివాళులు.

జవహర్​లాల్ నెహ్రూ...మోతిలాల్ నెహ్రూ, స్వరూప్ రాణి దంపతులకు నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్​లోని అలహాబాద్​లో జన్మించారు. స్వతంత్ర భారత చరిత్రలో మొదటి, అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్న రికార్డు నెహ్రూ పేరుతోనే ఉంది. ఆయన మే 27, 1964న చనిపోయే వరకు ప్రధాని పదవిలో కొనసాగారు.

నేడు నెహ్రూ 55వ వర్థంతి-నేతల ఘన నివాళి
Last Updated : May 27, 2019, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details