బిహార్లో ఉద్రిక్తత.. భాజపా-జేఏపీ కార్యకర్తల ఘర్షణ - protests against farm bills
బిహార్లో ఉద్రిక్తత.. భాజపా-జేఏపీ కార్యకర్తల ఘర్షణ
12:29 September 25
బిహార్లో ఉద్రిక్తత.. భాజపా-జేఏపీ కార్యకర్తల ఘర్షణ
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు బిహార్లో ఉద్రిక్తంగా మారాయి. పట్నాలోని భాజపా కార్యాలయాన్ని ముట్టడించారు పప్పు యాదవ్ సారథ్యంలోని జన్ అధికార్ పార్టీ(జేఏపీ) కార్యకర్తలు.
వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలని కార్యాలయం గేట్లు ఎక్కి ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహించిన భాజపా శ్రేణులు జేఏపీ కార్యకర్తలపై దాడికి దిగాయి. జేఏపీ కార్యకర్తలూ ఎదురుదాడి చేశారు.
Last Updated : Sep 25, 2020, 1:46 PM IST