జమ్ముకశ్మీర్ బుద్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. బుద్గాం జిల్లాలోని హరిబాగ్ మౌచ్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు మంగళవారం రాత్రి 9గంటల సమయంలో భద్రతాదళాలు, పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. ఈ పరిణామాలు ఎన్కౌంటర్కు దారితీశాయి.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం - jammu kashmir militants latest news
జమ్ముకశ్మీర్ బుద్గాం జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. అయితే వీరి వివరాలపై ఎలాంటి స్పష్టత లేదు.
జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్ -ఇద్దరు ముష్కరులు హతం
సుమారు నాలుగు గంటల పాటు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అయితే ముష్కరులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉగ్రవాదుల్లో ఒకరు విదేశీయుడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.