తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బౌద్ధ గురువు దలైలామా హత్యకు ఉగ్ర కుట్ర - BENGALURU

ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా హత్యకు 'జమాత్​ఉల్​ ముజాహిదీన్​' బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థ కుట్ర పన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో వెల్లడైంది. పోలీసులకు చిక్కిన ఉగ్రవాది హబీబుర్​ రెహమాన్​ను విచారించగా విస్తుపోయే అంశాలు తెలిశాయి. అప్పుడప్పుడు మైసూరు జిల్లా పిరియా పట్టణ పరిధి బైలుకుప్ప ధార్మిక కేంద్రానికి వచ్చే దలైలామా హత్యకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

దలైలామా హత్యకు ఉగ్ర కుట్ర

By

Published : Jun 28, 2019, 8:22 AM IST

Updated : Jun 28, 2019, 11:14 AM IST

కర్ణాటకలోని దొడ్డబళ్లాపురలో పోలీసులకు చిక్కిన బంగ్లాదేశ్​ ఉగ్రవాది హబీబుర్​ రెహమాన్​ (30) రహస్య కార్యకలాపాలను అధికారులు వెల్లడించారు. అజ్ఞాతవాసం గడుపుతూ.. అనేక నేరపూరిత ప్రణాళికల అమలుకు సిద్ధమైనట్లు గుర్తించారు. ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా హత్యకు కుట్ర పన్నిన విషయం కూడా బయటపడింది. రెహమాన్​ బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో దారి దోపిడీలకు పాల్పడినట్లు అధికారులు వివరించారు. జమాత్​ఉల్​ ముజాహిదీన్​ బంగ్లాదేశ్​ (జేఎంబీ) సభ్యులందరూ ఇలానే దారి దోపిడీలు, దొంగతనాలు చేసేవారని విచారణలో వెల్లడయింది. కోల్​కతా, బిహార్​లలో విచారణ అనంతరం బెంగళూరులో రెహమాన్​ను ఎన్​ఐఏ అధికారులు విచారించటం ప్రారంభించారు.

మైసూరులో హత్యకు ప్రణాళిక

మైసూరు జిల్లా పిరియా పట్టణ పరిధి బైలుకుప్ప ధార్మిక కేంద్రం, మైసూరు హెజ్జాళ సమీపంలోని శిక్షణ సంస్థకు అప్పుడప్పుడు వచ్చే దలైలామాను హత్య చేసేందుకు జేఎంబీ సభ్యులు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు.2013లో బుద్ధగయలో , 2014లో బంగాల్​లోపేలుళ్లకు పాల్పడిన అనంతరం హబీబుర్​ కర్ణాటకకు చేరుకున్నట్లు గుర్తించారు. వైట్​ఫీల్డ్​లో కొందరు దళారుల సాయంతో ఆధార్​ కార్డునూ పొందడం విస్మయం కలిగించే విషయం. పోలీసులకు దొరక్కుండా సహచరులతో మాట్లాడేందుకు సంకేత భాషను ఉపయోగించేవాడని అధికారుల దర్యాప్తులో తేలింది. రామనగరలో మునీర్​ అనే ఉగ్రవాది వద్ద రెహమాన్​ కొన్నాళ్లు ఆశ్రయం పొందాడు. గత ఏడాది ఆగస్టులో పోలీసులకు మునీర్​ చిక్కడంతో రెహమాన్​ దొడ్డబళ్లాపురకు చేరుకుని ఓ మసీదులో తలదాచుకున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: స్విస్​ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల సంపద

Last Updated : Jun 28, 2019, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details