దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో తాజాగా మరో ఘటన జరిగింది. మైనర్లు అయిన నలుగురు అక్కాచెల్లెళ్లను అతి కిరాతకంగా హత్యచేశారు దుండగులు. వీరి వయస్సు 13, 11, 8, 6 సంవత్సరాలు. 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం విషయం బయటకు రాకుండా కప్పిపుచ్చుకునేందుకు దుండగులు ఆ నలుగురిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబధించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
జల్గావ్ జిల్లా రేవర్లో బాధిత కుటుంబం నివాసం ఉంటోంది. ఓ పని కోసం తల్లిదండ్రులతో కలిసి మధ్యప్రదేశ్ వెళ్లాడు బాలికల సోదరుడు. ఇంట్లో ఉంటున్న తన చెల్లెళ్లను గమనించాలని నలుగురు స్నేహితులకు చెప్పాడు. ఈ సమయాన్నే అదునుగా తీసుకున్న కిరాతకులు దారుణానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి చిన్నారులు నిద్రిస్తున్న సమయంలో మద్యం సేవించి ఇంట్లోకి చొరబడ్డారు. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సమయంలో నిద్ర నుంచి మేల్కొన్న బాలిక ముగ్గురు చెల్లెళ్లను గొడ్డలితో నరికి చంపినట్లు, అత్యాచారం అనంతరం 13 ఏళ్ల బాలికను సైతం హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
శుక్రవారం ఉదయం ఇంట్లో రక్తపు మడుగులో పడివున్న చిన్నారులను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన వారు బాధితురాలి సోదరుడికి ఫోన్ చేశారు. తన నలుగురు స్నేహితుల గురించి అతడు పోలీసులకు చెప్పాడు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. బాలికల గొంతులపై లోతైన గొడ్డలి గాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చిత్రహింసలు..