కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ గొప్ప నేతని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. దిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన సంస్మరణ సభకు ఆయన హాజరయ్యారు. జైట్లీ చాలా రోజులుగా అనారోగ్యంగా ఉన్నారని, కానీ ఎప్పుడూ ఆ విషయం గురించి మాట్లాడేవారు కాదని తెలిపారు.
నిరంతరం దేశ ఉజ్వల భవిష్యత్తు కోసమే ఆలోచించేవారన్నారు. అదే స్ఫూర్తితో తాము దిశగా నడిచామని తెలిపారు. ఆయన జ్ఞానం అపారమనీ, అది దేవుడు ఇచ్చిన వరమని కితాబిచ్చారు.
"ఆయన చేసిన సేవలకు గౌరవపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. నా స్నేహితునికి నివాళులు అర్పిస్తున్నా. ఒక గొప్ప పాత మిత్రుడు.. వయసులో చిన్నవాడు... ఆయనకు నేను శ్రద్ధాంజలి ఘటించే రోజు వస్తుందని ఏనాడూ అనుకోలేదు. ఓ శాంతి."