ఎన్నికల వేళ రాజకీయ కోణంలో ఐటీ దాడులు జరగుతున్నాయన్న విపక్షాల ఆరోపణలను ఖండించారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. వాళ్లకున్న సమాచారం, ఆధారాల మేరకే ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు.
పలు రాష్ట్రాల్లోని ముఖ్య నేతల అనుచరులు, సంబంధీకుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ ఇటీవల సోదాలు నిర్వహించింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్, కర్ణాటకలో జేడీఎస్ పార్టీకి చెందిన ఓ మంత్రి, తమిళనాడులోని డీఎంకే పార్టీ నేత అనుచరులపై ఐటీ దాడులు జరిగాయి.
విపక్షాల ఆరోపణలు
రాజకీయ కోణంలోనే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్తో సహా విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. ఐటీ దాడులకు సంబంధించి రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండేకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థలు తటస్థంగా వ్యవహరించాలని నొక్కి చెప్పింది.