తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​: నిలకడగా జైట్లీ ఆరోగ్యం-ఎయిమ్స్ ప్రకటన

By

Published : Aug 9, 2019, 8:42 PM IST

Updated : Aug 9, 2019, 10:44 PM IST

అరుణ్​ జైట్లీ

22:23 August 09

ఎయిమ్స్​కు చేరుకుంటున్న నేతలు

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ అనారోగ్యంతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఇవాళ మధ్యాహ్నం శ్వాస తీసుకొనేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు జైట్లీని ఎయిమ్స్‌కు తరలించారు. గుండె సంబంధమైన విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.

జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్‌ వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. జైట్లీని ఐసీయూలో ఉంచామని... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. జైట్లీ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న భాజపా నాయకులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా.. జైట్లీ ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఎయిమ్స్‌ చేరుకున్నారు.

కొన్నాళ్లుగా అరుణ్‌ జైట్లీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. గతేడాది మేలో ఆయన కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. గతంలో ఆయన బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నారు.

22:02 August 09

  • ఎయిమ్స్‌కు వచ్చిన లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
  • ఎయిమ్స్‌కు వచ్చిన రవిశంకర్‌ ప్రసాద్‌, జేపీ నడ్డా, హర్షవర్ధన్‌, శరద్‌ యాదవ్‌
  • ఎయిమ్స్‌కు వచ్చిన బాబా రాందేవ్‌

21:55 August 09

నిలకడగానే జైట్లీ ఆరోగ్యం: ఎయిమ్స్

తీవ్ర అనారోగ్యం కారణంగా కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ దిల్లీ ఎయిమ్స్​లో ఈ రోజు ఉదయం చేరినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్య బులెటిన్​లో తెలిపారు. 

జైట్లీ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు దిల్లీ పెద్దలు ఎయిమ్స్​కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఎయిమ్స్​కు వచ్చారు. 

కొన్నాళ్లుగా గుండె, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు జైట్లీ. 

21:10 August 09

  • జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది  ఎయిమ్స్‌ ఆసుపత్రి. అరుణ్‌ జైట్లీ ఇవాళ ఉదయం ఆస్పత్రిలో చేరారని ప్రకటించింది. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం జైట్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది.

20:54 August 09

  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోమంత్రి అమిత్​షా దిల్లీ ఎయిమ్స్​కు చేరుకున్నారు. అరుణ్​ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. 

20:43 August 09

ఎయిమ్స్​కు చేరుకున్న మోదీ, అమిత్​ షా

  • కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీకి తీవ్ర అస్వస్థత
  • గుండె, మూత్రపిండ సమస్యలతో దిల్లీ ఎయిమ్స్‌లో చేరిక
  • ఎయిమ్స్‌లో అరుణ్‌ జైట్లీకి చికిత్స అందిస్తున్న వైద్య బృందం
  • ఎయిమ్స్‌కు వచ్చిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా
  • జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న మోదీ, అమిత్‌షా
  • ఎయిమ్స్‌కు వచ్చిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్రమంత్రి హర్షవర్ధన్‌

14:59 August 09

భాజపా సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి అరుణ్​జైట్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన అనారోగ్యం కారణంగా దిల్లీ ఎయిమ్స్​లో చేరారు. 

ప్రస్తుతం ఆయనను పరిశీలనలో ఉంచారని... ప్రత్యేక వైద్యుల బృందం ఆయనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని సమాచారం. ఈ ఏడాది మేలో జైట్లీకి మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2014లో  జైట్లీకి బేరియాట్రిక్ శస్త్ర చికిత్స జరిగింది. 

Last Updated : Aug 9, 2019, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details