భాజపా సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న గుండె, మూత్రపిండాల సమస్యలతో శుక్రవారం దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు.
ఆందోళనకరంగా అరుణ్‌జైట్లీ ఆరోగ్యం.. ఎయిమ్స్‌లో చేరిక
భాజపా సీనియర్ నేత అరుణ్‌జైట్లీ ఆరోగ్యం పరిస్థితి విషమంగా మారింది. కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తీవ్ర అనారోగ్యంతో దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. అరుణ్‌జైట్లీని ప్రత్యేక వైద్య బృందం పరిశీలనలో ఉంచినట్లు సమాచారం.
ఆందోళనకరంగా అరుణ్‌జైట్లీ ఆరోగ్యం
ప్రస్తుతం ఆయనను పరిశీలనలో ఉంచారని... ప్రత్యేక వైద్యుల బృందం ఆయనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని సమాచారం. ఈ ఏడాది మేలో జైట్లీకి మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2014లో జైట్లీకి బేరియాట్రిక్ శస్త్ర చికిత్స జరిగింది.
జైట్లీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎయిమ్స్‌కు చేరుకున్నారు.
Last Updated : Aug 9, 2019, 10:05 PM IST