తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'క్షీణించిన జైట్లీ ఆరోగ్యం.. చికిత్స కోసం విదేశాలకు!' - మంత్రి మండలి

ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలని జైట్లీకి వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడబోయే మంత్రివర్గంలో పదవిని స్వీకరించే అవకాశాలు కన్పించడం లేదు.

క్షీణించిన జైట్లీ ఆరోగ్యం.. చికిత్స కోసం విదేశాలకు!

By

Published : May 25, 2019, 5:47 AM IST

Updated : May 25, 2019, 8:14 AM IST

'క్షీణించిన జైట్లీ ఆరోగ్యం.. చికిత్స కోసం విదేశాలకు!'

అనారోగ్యం కారణంగా మెరుగైన చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ. ఆరోగ్యం మరింత క్షీణించటం వల్ల వైద్యుల సూచన మేరకు బ్రిటన్ లేదా అమెరికాకు వెళ్లనున్నట్టు సమాచారం. ఈ సమయంలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వంలో కొనసాగే అవకాశాలు కన్పించడం లేదు.

సుదీర్ఘకాలం నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న జైట్లీ ఆరోగ్యం గతకొన్ని వారాలుగా మరింత క్షీణించగా ఇటీవల దిల్లీ ఎయిమ్స్​లో చేరారు జైట్లీ.

ఆరోగ్యం కుదుటపడకముందే గురువారం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు. ఆయన ఇప్పటి వరకు నిర్వహించిన శాఖల అధికారులతో సమావేశమయ్యారు. భాజపా విజయోత్సవ సంబరాలకు మాత్రం హాజరుకాలేకపోయారు. బ్లాగ్, ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి పదవిపై అనుమానాలు

విదేశాలకు వెళ్లనున్న నేపథ్యంలో మంత్రివర్గంలో చోటుపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ అవకాశం వచ్చినా పోర్ట్​ఫోలియో లేనిదే మంత్రి పదవిని స్వీకరించేందుకు సుముఖంగా లేరని సమాచారం.

గతేడాది మేలో కిడ్నీ మార్పిడి తర్వాత జైట్లీ ఆరోగ్యం అస్థిరంగా ఉంటోంది. మూడు వారాలుగా కార్యాలయానికి కూడా హాజరు కాలేదు. 16వ లోక్​సభ రద్దు కోసం శుక్రవారం నిర్వహించిన కేబినెట్​ భేటీకి కూడా జైట్లీ రాలేకపోయారు.

భాజపాకు కీలకం

మోదీ కేబినెట్​లో జైట్లీ కీలకమైన వ్యక్తి. ఎన్డీఏ ప్రభుత్వంలో ట్రబుల్​ షూటర్​గా పేరు తెచ్చుకున్నారు. విపక్షాల విమర్శలకు దీటుగా బదులివ్వటంలో జైట్లీ దిట్ట. భారతీయ జనతా పార్టీలో ముఖ్య వ్యూహకర్తల్లో ఒకరు. మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల్లో జైట్లీ ప్రధాన పాత్ర పోషించారు. వస్తుసేవల పన్ను, ముమ్మారు తలాక్​ నిషేధంలో కీలకంగా వ్యవహరించారు. అనారోగ్యం కారణంగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు.

Last Updated : May 25, 2019, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details