జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్ మున్నా లాహోరీని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో మరో ఉగ్రవాదీ మరణించాడు.
కశ్మీర్ ఎన్కౌంటర్లో జైషే టాప్ కమాండర్ హతం - మున్నా లాహోరీ
జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్ మున్నా లాహోరీ అలియాస్ బిహారీ సహా మరో ఉగ్రవాదిని భద్రత బలగాలు మట్టుబెట్టాయి. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
కశ్మీర్లో ఎందరో పౌరులను హతమార్చిన లాహోరీ... జైషే ఉగ్రసంస్థకు నియామకాలు చేపట్టేవాడు. బిహారీ పేరుతో పలు ప్రాంతాల్లో ఉగ్ర కార్యకలాపాలను సాగించాడు.
బోన్బజార్లో ముష్కరులు తలదాచుకున్నారని పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. అనంతరం ఆ ప్రాంతంలో శుక్రవారం నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ముందే పసిగట్టిన తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల చర్యలను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. శనివారం ఉదయం ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.