తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆయుష్మాన్​ భారత్​ వారి కోసమే'

కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరోగ్య బీమా పథకం 'ఆయుష్మాన్ భారత్​'పై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ సీనియర్​ నేత జైరాం రమేశ్​. 'ఆయుష్మాన్ భారత్'​ విధివిధానాలు ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే విధంగా ఉన్నాయని ఆరోపించారు.

ఆయుష్మాన్ భారత్​పై జైరాం రమేశ్ విమర్శలు

By

Published : Mar 17, 2019, 7:50 AM IST

ఆయుష్మాన్ భారత్​పై జైరాం రమేశ్ విమర్శలు
ఆయుష్మాన్​ భారత్​లో లోపాలునున్నాయంటూ విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ సీనియర్​ నేత జైరాం రమేశ్. పథకంలోని విధి విధానాలు ప్రైవేటు సంస్థలకు లాభించేవిగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. మోదీ చెబుతున్నట్టు ఆయుష్మాన్ గొప్ప పథకమేమీ కాదన్నారు జైరాం.

"ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టేలా ఆయుష్మాన్ భారత్ నిబంధనలు రూపొందించారు. ప్రైవేటు సంస్థలు, ఆస్పత్రులు, బీమా కంపెనీలకు మాత్రమే దీనివల్ల ఉపయోగం. "-జైరాం రమేశ్, కాంగ్రెస్​ సీనియర్​ నేత

'ఔట్​ పేషెంట్'​ విభాగానికి పథకం వర్తించకపోవటంపై మండిపడ్డారు జైరాం. 'ఔట్​ పేషెంట్స్​' 85 శాతం చికిత్స కోసం ఖర్చు చేస్తున్నారని.. ఈ పథకం వల్ల వారికేమీ ఉపయోగం లేదని పేర్కొన్నారు.

చక్కెర, రక్తపోటు వ్యాధుల చికిత్సను పథకంలో భాగం చేయకపోవడాన్ని జైరాం రమేశ్​ తప్పుబట్టారు. దేశంలో చక్కెర వ్యాధిగ్రస్థులు అధికంగా ఉన్నారని గుర్తుచేశారు.

పథకం..

దేశంలో 10 కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి రూ. 5 లక్షల బీమా లభిస్తుంది.

ఇదీ చూడండి:మట్టి లేకుండా మొక్కల పెంపకం

ABOUT THE AUTHOR

...view details