తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​ జట్టు యజమానికి రెండేళ్లు జైలు

డ్రగ్స్​ కలిగి ఉన్నారన్న కారణంతో ఐపీఎల్​ కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​ సహ యజమాని, వాడియా గ్రూపు సంస్థల బోర్డు డైరెక్టర్​ 'నెస్​ వాడియా'కు జపాన్​ కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

పంజాబ్​ జట్టు యజమానికి రెండేళ్లు జైలు

By

Published : Apr 30, 2019, 5:22 PM IST

ఐపీఎల్​ కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​ సహ యజమాని, వాడియా గ్రూపు సంస్థల డైరెక్టర్​ 'నెస్​ వాడియా'కు జపాన్​ కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న కేసులో సప్పోరో జిల్లా న్యాయస్థానం ఈమేరకు తీర్పు ఇచ్చింది. అయితే... శిక్ష అమలును ఐదేళ్లు నిలుపుదల చేసింది.

సెలవులపై మార్చిలో ఉత్తర జపాన్​లోని ఓ ద్వీపంలోని విమానాశ్రయంలో 25 గ్రాముల గంజాయి​తో దొరికినట్లు ఓ పత్రిక కథనం ప్రచురించింది.

ఎలాంటి ప్రభావం ఉండదు...

ఈ జైలు శిక్షపై వాడియా గ్రూపు స్పందించింది. సస్పెండెడ్​ శిక్ష అయినందున దాని ప్రభావం నెస్​వాడియాపై ఉండదని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఎప్పటిలానే నెస్​వాడియా తన బాధ్యతలను యథావిధిగా నిర్వహిస్తారన్నారు.

నెస్​వాడియా ప్రస్తుతం వాడియా గ్రూపులోని బాంబే డయింగ్​, బాంబే బుమ్రా ట్రేడింగ్​ కార్పొరేషన్​కు డైరెక్టర్​గా ఉన్నారు.

అలా కలిసొచ్చింది....!

కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను ఐదు సంవత్సరాల సస్పెండ్​ చేసినట్లు తెలుస్తోంది. సస్పెండెడ్​ శిక్షగా పిలిచే ఇందులో జైలు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఐదేళ్లలో మళ్లీ ఎలాంటి నేరం చేయకుండా ఉంటే సరిపోతుంది.

ABOUT THE AUTHOR

...view details