జమ్ముకశ్మీర్ శ్రీనగర్లో కేంద్ర కారాగార సిబ్బందికి, ఖైదీలకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ గొడవల్లో జైలు ఆస్తులు ధ్వంసమయ్యాయి.
రణరంగంలా శ్రీనగర్ జైలు- కశ్మీర్ ఉద్రిక్తం - శ్రీనగర్
జమ్ముకశ్మీర్ శ్రీనగర్లో సెంట్రల్ జైల్ సిబ్బందితో ఘర్షణకు దిగారు ఖైదీలు. వేరే గదులకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ గొడవపడ్డారు. గ్యాస్ సిలిండర్లకు నిప్పంటించారు. జైల్లోని రెండు బ్యారక్లు, మెస్ దగ్ధమయ్యాయి.
రణరంగంలా శ్రీనగర్ జైలు- కశ్మీర్ ఉద్రిక్తం
జైలును నవీకరించేందుకు కొంతమంది ఖైదీలను వేరే గదుల్లో ఉంచాలని నిర్ణయించారు అధికారులు. కొత్త గదులకు మార్చేందుకు ప్రయత్నించగా అధికారులపై తిరుగుబాటు చేశారు. వేరే జైళ్లకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారనుకుని ఘర్షణకు దిగారు. గ్యాస్ సిలిండర్లకు నిప్పంటించారు. సామగ్రి ధ్వంసం చేశారు. రెండు బ్యారక్లు, భోజనశాల పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు వెల్లడించారు అధికారులు. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్లో అంతర్జాల సేవలు నిలిపివేశారు.