తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజస్థాన్​లోని ఇటాలియన్​ పర్యటకుడికి కరోనా వైరస్​! - corona latest news

భారత పర్యటనకు వచ్చిన ఇటలీ దేశస్థుడికి కరోనా లక్షణాలు కనిపించాయి. గత శనివారం రాజస్థాన్​లోని జైపూర్​కు వచ్చిన అతనికి పరీక్షలు నిర్వహించగా తొలుత నెగిటివ్​గా వచ్చినప్పటికీ.. రెండో పరీక్షలో పాజిటివ్​గా తేలింది.

Italian tourist tests positive for coronavirus in Rajasthan
భారత్​లో ఇటలీ వ్యక్తికి కరోనా లక్షణాలు

By

Published : Mar 2, 2020, 8:33 PM IST

Updated : Mar 3, 2020, 5:03 AM IST

భారత పర్యటన నిమిత్తం గత శనివారం రాజస్థాన్​ రాజధాని జైపూర్​కు వచ్చిన ఓ ఇటలీ వ్యక్తిలో కరోనా లక్షణాలు గుర్తించారు అధికారులు. అయితే పుణెలో పరీక్షలు నిర్వహించి.. అతనికి సోకింది కరోనానో కాదో నిర్ధరించనున్నారు.

ఇదీ జరిగింది..

ఓ ఇటాలియన్​ వ్యక్తి గత శనివారం జైపూర్​కు వచ్చాడు. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా లక్షణాలు కనిపించలేదు. కానీ.. అతని ఆరోగ్య పరిస్థితిపై అనుమానంతో అధికారులు.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచి రెండోసారి పరీక్షలు చేశారు. సోమవారం వచ్చిన ఫలితాల్లో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది.

రెండు పరీక్షల్లో వేర్వేరు ఫలితాలు రావడంపై రాజస్థాన్​ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ స్పందించారు. మరోమారు పరీక్షలు చేసేందుకు బాధితుడి సాంపుల్స్​ను పుణెలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీకి పంపనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: బంగారం అమ్మేస్తున్నారు.. విమానాలకు గిరాకీ

Last Updated : Mar 3, 2020, 5:03 AM IST

ABOUT THE AUTHOR

...view details