తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దాడులు చేసినంత మాత్రాన మోదీకి జైకొట్టం'

తమిళనాడులోని డీఎంకే కోశాధికారి దొరై మురుగన్​ నివాసంపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. లెక్కచూపని నగదును ఎన్నికల ప్రచారం కోసం వినియోగిస్తున్నారన్న సమాచారంతో మురుగన్​ నివాసంలో సోదాలు చేసింది ఆదాయపు పన్ను శాఖ.

'దాడులు చేసినంత మాత్రాన మోదీకి జైకొట్టం'

By

Published : Mar 30, 2019, 10:01 AM IST

Updated : Mar 30, 2019, 3:59 PM IST

it-raids-on-dmk-treasure
తమిళనాడులోని డీఎంకే నేతలే లక్ష్యంగా ఐటీ శాఖ దాడులు చేసింది. వెల్లూరులోని పార్టీ కోశాధికారి మురుగన్ లెక్కచూపని నగదును ప్రచారం కోసం వినియోగిస్తున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించింది. కట్పాడిలోని కింగ్​స్టన్​ ఇంజనీరింగ్​ కళాశాల, దొరై మురుగన్​ డిగ్రీ కళాశాల్లోనూ ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది.

ఐటీ శాఖ అధికారులతో పాటు ఎన్నికల ఫ్లయింగ్​ స్క్వాడ్​ శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సోదాలు చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కొందరు నాయకులు ఐటీ శాఖ చేత దాడులు చేయించారని ​ ఆరోపించారు మురుగన్​.

"ఇది కచ్చితంగా కుట్రే. దాడులు చేయమని ఐటీశాఖకు ఆదేశాలిస్తే.. మేము మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తామనుకోవడం పొరపాటు. ఇది ప్రజాస్వామ్యం. దాడులు చేయించడం వల్ల మోదీకి ఒరిగేదేమీ లేదు."
- దొరై మురుగన్​, డీఎంకే కోశాధికారి

దక్షిణాదిలో ఐటీశాఖ దాడులు పెరిగాయి. గురువారం కర్ణాటక మంత్రి పుట్టరాజు నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఈ ఘటనతో కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.

ఇదీ చూడండి:కాంగ్రెస్​ న్యాయ్​ హామీకి మూలం మోదీ: రాహుల్​

Last Updated : Mar 30, 2019, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details