తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాల్​ దినకరన్​ ఇంట్లో 5 కిలోల బంగారు కడ్డీలు

తమిళనాడులోని క్రైస్తవ మత ప్రచారకుడు పాల్​ దినకరన్​ ఇళ్లు, సంస్థల్లో ఐటీశాఖ సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో లెక్కలోకి రాని రూ.120 కోట్ల పెట్టుబడులను గుర్తించింది. 5 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకుంది.

Paul Dinakaran
పాల్‌ దినకరన్‌ ఇళ్లు, సంస్థల్లో ఐటీ సోదాలు

By

Published : Jan 24, 2021, 9:12 AM IST

క్రైస్తవ మత ప్రచారకుడు పాల్‌ దినకరన్‌ ఇళ్లు, కార్యాలయాలు, సంస్థలు, ఫౌండేషన్‌లలో తమిళనాడు ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం నుంచి సోదాలు చేస్తున్నారు. లెక్కలోకి రాని రూ.120 కోట్ల పెట్టుబడులు గుర్తించారు. కోయంబత్తూరులోని కారుణ్య విశ్వవిద్యాలయంలో 5 కిలోల బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకొన్నారు. విచారణకు హాజరుకావాలని ఆయనకు అధికారులు నోటీసు పంపారు.

పాల్‌ దినకరన్‌కు చెందిన 'జీసస్‌ కాల్స్‌' సంస్థ కార్యాలయాలు, కారుణ్య విశ్వవిద్యాలయం తదితర 28 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. 20వ తేదీన ప్రారంభించిన ఈ సోదాలు శనివారం ఉదయం ముగిశాయి. సభల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదని.. స్వదేశం, విదేశాల నుంచి వచ్చిన ఆదాయాన్ని లెక్కల్లో చూపకుండా పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారని సమాచారం.

ఇదీ చూడండి:వైరల్: స్నేహితుడిని చితకబాదిన యువకులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details