సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు డీఎంకే, ఏఎంఎంకే నేతల ఇళ్లపై ఐటీ దాడులు చేయడాన్ని నిరంకుశ, పక్షపాత చర్యగా అభివర్ణించారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. విస్తృత సోదాలు జరిపినా వారి ఇళ్లలో ఏమీ దొరకలేదని వార్తలు వస్తున్నాయని వరుస ట్వీట్లు చేశారు.
'నిరంకుశ, పక్షపాత వైఖరితో ఐటీ శాఖ'
తమిళనాట ప్రతిపక్ష నేతలు, వారి సంబంధీకులపై ఐటీ దాడుల్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీవ్రంగా తప్పుబట్టారు. ఆదాయ పన్ను శాఖ పక్షపాత వైఖరితో పనిచేస్తోందని ఆరోపించారు.
'నిరంకుశ, పక్షపాత వైఖరితో ఐటీ శాఖ'
"విపక్ష నేతల ఇళ్లలో సొమ్ము గురించి మాత్రమే ఐటీ శాఖ అధికారులకు ఎందుకు సమాచారం అందుతుంది?
తమిళనాడులో 2019 పార్లమెంటు ఎన్నికలు అంటే అందరికీ ఐటీ దాడులే గుర్తొస్తాయి."
-చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి
తూత్తుకుడిలో డీఎంకే నేత కనిమొళి ఇంటిపై గత రాత్రి ఎన్నికల సిబ్బందితో పాటు ఐటీ అధికారులు సోదాలు చేశారు. థేనిలో దినకరన్ వర్గానికి చెందినవారిపైనా ఐటీ దాడులు జరిగాయి.
Last Updated : Apr 17, 2019, 3:39 PM IST