ఇద్దరు వ్యోమగాములను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన..స్పేస్ ఎక్స్ సంస్థ, నాసాలకు.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభినందనలను తెలియజేసింది. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు ఇది సరికొత్త నాంది అని అభివర్ణించింది.
"2011 తర్వాత మొదటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగమిది. అద్భుతంగా పని చేశారు."అని ఇస్రో ట్వీట్ చేసింది.
అమెరికా వ్యాపార వేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ రూపొందించిన క్రూడ్ డ్రాగన్ వ్యోమనౌక శనివారం నాడు ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.