తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘనంగా ఐఎస్​బీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం - ఐఎస్​బీ

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్​బీ)పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో 'ప్రపంచ ఐఎస్​బీ పూర్వ విద్యార్థుల మూడో వార్షిక సమ్మేళనం' ఘనంగా జరిగింది. కాలిఫోర్నియా, లండన్‌, దుబాయి సహా మొత్తం 14 ముఖ్య పట్టణాల్లో  ఈ వేడుకలు నిర్వహించారు. దాదాపు 1000 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా ఐఎస్​బీ పూర్వ విద్యార్థుల  వార్షికోత్సవాలు

By

Published : Apr 15, 2019, 9:01 PM IST

Updated : Apr 16, 2019, 12:17 AM IST

ఘనంగా ఐఎస్​బీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్​బీ) పూర్వ విద్యార్థుల సంఘం మూడో వార్షిక సమ్మేళనం ఘనంగా జరిగింది. లండన్​, దుబాయ్​, సింగపూర్​, సిడ్నీ వంటి ముఖ్య పట్టణాలతో సహా ప్రపంచంలోని 14 నగరాల్లో ఈ వేడుకలు నిర్వహించారు. ఐఎస్​బీ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.

పలు సంస్థల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఐఎస్​బీ డీన్‌ రాజేంద్ర శ్రీవాత్సవ కలుసుకున్నారు. ఏటా ఐఎస్​బీ పట్టభద్రుల దినోత్సవం తర్వాతి రోజు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తారు.

ఇదీ చూడండి: మోదీ హామీలపై లాలూ డబ్​స్మాష్​ పంచ్

Last Updated : Apr 16, 2019, 12:17 AM IST

ABOUT THE AUTHOR

...view details