తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రమాణస్వీకారానికి వస్తే రాహుల్​ ఉరేసుకున్నట్లేనేమో?' - maharashtra news

రాహుల్​ గాంధీపై భాజపా తీవ్ర విమర్శలు చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి గైర్హాజరు కావడంపై వ్యంగంగా స్పందించింది. గతంలో శివసేన గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించిన విషయాన్ని గుర్తుచేస్తూ విమర్శనాస్త్రాలు సంధించింది.

Is Rahul ashamed to attend Thackeray's swearing-in: BJP on Sena praising Godse in past
'ప్రమాణస్వీకారానికి వస్తే రాహుల్​ ఉరేసుకున్నట్లేనేమో?'

By

Published : Nov 28, 2019, 11:56 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారానికి రాహుల్​ గాంధీ గైర్హాజరు కావటంపై భారతీయ జనతా పార్టీ వ్యంగస్త్రాలు సంధించింది. మహాత్మ గాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేను గతంలో శివసేన పొగడ్తలతో ముంచెత్తిన విషయాన్ని ప్రస్తావించి... కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణమిదేనా అంటూ రాహుల్​ను ఎద్దేవా చేసింది.

కపటంగా ఉండటం మానేయండి రాహుల్​ గాంధీ. సామ్నా(శివసేన అధికార పత్రిక) సంపాదకీయులు ఉద్ధవ్​ ఠాక్రే.. గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించారు. ఇందుకోసమేనా మీరు కార్యక్రమానికి హాజరుకావడానికి సిగ్గుపడ్డారు. ఉద్ధవ్​ను ఆలింగనం చేసుకోవడం అంటే తను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లేనని రాహుల్​ భయపడ్డారేమో? -జీవీఎల్​ నరసింహారావ్​, భాజపా అధికార ప్రతినిధి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేపై కూడా నరసింహా తీవ్ర విమర్శలు చేశారు. సామ్నా పత్రికను 'సోనియానామా'గా పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు..

ABOUT THE AUTHOR

...view details