తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరం పిటిషన్​​పై సీబీఐకి దిల్లీ హైకోర్టు నోటీసులు - చిదంబరం

చిదంబరం దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​పై స్పందించాలని సీబీఐకి నోటీసీలు జారీ చేసింది దిల్లీ హైకోర్టు. 7 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

చిదంబరం బెయిల్​పై సీబీఐకి దిల్లీ హైకోర్టు నోటీసులు

By

Published : Sep 12, 2019, 12:57 PM IST

Updated : Sep 30, 2019, 8:05 AM IST

కేంద్ర దర్యాప్తు సంస్థకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​పై స్పందించాలని ఆదేశించింది. 7 రోజుల్లోగా నివేదిక అందించాలని స్పష్టం చేసింది. ఈ నెల 23న తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో సీబీఐ కస్టడీ ఎదుర్కొంటున్న చిదంబరం.. తనకు బెయిల్​ మంజూరు చేయాలని బుధవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు 14 రోజుల సీబీఐ కస్టడీ విధించిన ట్రయిల్​ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మరో పిటిషన్​ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్​ను కేంద్ర మాజీ మంత్రి వెనక్కి తీసుకున్నారు.

73 ఏళ్ల కాంగ్రెస్​ నేతను ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. చిదంబరంపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని.. అందుకే కస్టడీకి అప్పగించినట్టు ట్రయిల్​ కోర్టు తెలిపింది. కేంద్ర మాజీ మంత్రిని అధికారులు తిహార్​ జైలుకు తరలించారు.

యూపీఏ హయాంలో మంత్రిగా ఉండగా... విదేశీ నిధులు పొందేందుకు ఐఎన్​ఎక్స్​ మీడియాకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్నది చిదంబరంపై ఉన్న ప్రధాన ఆరోపణ.

ఇదీ చూడండి:- రూపాయికే 4 ఇడ్లీల కమలాత్తాళ్​కు మహీంద్రా భరోసా

Last Updated : Sep 30, 2019, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details