కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు తక్షణమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని దిల్లీ ఎయిమ్స్‌ను ఆదేశించింది అక్కడి హైకోర్టు. ప్రస్తుతం ఈ కాంగ్రెస్ సీనియర్ నేత.. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
క్రోన్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంటూ.. బెయిల్ మంజూరు చేయాలని చిదంబరం కోరిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది న్యాయస్థానం.
బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మెడికల్ బోర్డు ఈ రోజు సమావేశమై చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై చర్చించాలని.. రేపు కోర్టుకు నివేదిక అందించాలని సూచించింది. చిదంబరం కుటుంబ వైద్యుడు, హైదరాబాద్‌కు చెందిన జీర్ణాశయ ప్రేగు వైద్య నిపుణులు డా. నాగేశ్వర్ రెడ్డిని బోర్డు సభ్యుడిగా నియమించాలని ఆదేశించింది.