తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు - భారీ వర్షాలు

భారీ వర్షాలు ఉత్తర భారత్​ను ముంచెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వరదలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ముంబయిలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు

By

Published : Aug 2, 2019, 5:37 PM IST

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు
ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

బిహార్​, హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, జమ్ముకశ్మీర్​, మధ్యప్రదేశ్​, గుజరాత్​, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్​ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగంలోకి దిగిన విపత్తు స్పందన దళం (ఎన్​డీఆర్​ఎఫ్​) అధికారులు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

జమ్ము కశ్మీర్​లోని చినాబ్​ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నది తీర ప్రాంతంలోని గ్రామాల్లోకి నీరు చేరింది. హిమాచల్​ ప్రదేశ్​లో భారీ వర్షాలకు సోలన్​ జిల్లా ధరంపుర్​లో రైలు పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.

గుజరాత్​లో..

గుజరాత్​లో వడోదరా నగరం, పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాతాలకు తరలిస్తున్నారు అధికారులు. రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అహ్మదాబాద్​ వాతావరణ శాఖ హెచ్చరించింది.

ముంబయిలో..

సముద్ర తీరంలో ఏర్పడిన అల్ప పీడనం వల్ల ముంబయిలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు సకినాక ప్రాంతంలోని ఓ హౌసింగ్​ సొసైటీలో గోడ కూలి ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 43.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: గుజరాత్​: భారీ వర్షాలకు వడోదరా అతలాకుతలం

ABOUT THE AUTHOR

...view details