తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్ కాల్పుల్లో నవజాత శిశువు మృతి - కాల్పులు

జమ్ముకశ్మీర్​ పుంఛ్​ సెక్టార్ నియంత్రణ రేఖ వెంట ఆదివారం రాత్రి పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ మూకల కాల్పుల్లో అత్యంత బాధాకరంగా 10 రోజుల నవజాత శిశువు మృతి చెందింది. శిశువు తల్లి సహా మరో వ్యక్తి గాయపడ్డారు. కాల్పుల కారణంగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

పాక్ కాల్పుల్లో 10 రోజుల శిశువు మృతి

By

Published : Jul 29, 2019, 1:43 PM IST

నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్​ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఆదివారం రాత్రి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ పుంఛ్​లోని షాపూర్ సెక్టార్​ నియంత్రణ రేఖ వెంట పాక్ మోర్టార్ షెల్​లు ప్రయోగించింది. సమీపంలోని సైనిక శిబిరం, గ్రామాలే లక్ష్యంగా ఈ దాడులు చేసింది పాక్.

భారత సేనలు దాయాది​ కాల్పులను సమర్థంగా తిప్పికొట్టాయి. అయితే.. పాక్​ దళాల తూటాలకు 10 రోజుల శిశువు బలైంది. శిశువు తల్లి, మరో వ్యక్తి గాయపడ్డారు. వీరిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. పాక్​ సిబ్బంది దాడులతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ఇదీ చూడండి: కర్ణాటక సభాపతి రమేశ్​ కుమార్​ రాజీనామా

ABOUT THE AUTHOR

...view details