తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాముకు ప్రాణం పోసిన ఐటీశాఖ అధికారి..!

తీవ్రంగా గాయపడి, క్రిమిసంహారకాల దాడికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాముకు ఓ ఆదాయపన్ను శాఖ అధికారి ప్రాణం పోశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో జరిగింది.

ఇష్టంతో శ్రమించాడు... పాముకు పునర్జన్మ అందించాడు

By

Published : Jun 2, 2019, 7:52 PM IST

ఇష్టంతో శ్రమించాడు... పాముకు పునర్జన్మ అందించాడు

మధ్యప్రదేశ్​ ఇండోర్​లోని స్థానిక పాఠశాలలోకి దూరిన ఓ పామును అక్కడి కాపలాదారులు తీవ్రంగా కొట్టి దానిపై క్రిమిసంహారకాలు పోశారు. ఘటనను గమనించిన ఓ వన్యప్రాణి ప్రేమికుడు, ఆదాయపన్ను శాఖ అధికారి షేర్​ సింగ్ చలించిపోయాడు. తనకు తెలిసిన విద్యతో ఆ పాముకు పునర్జన్మనిచ్చాడు.

పాము నోట్లో స్ట్రా పెట్టి చల్లని నీటిని పొట్టలోకి పంపాడు. కడుపులోని రసాయానాలను శుభ్రం చేశాడు. స్ట్రా ద్వారా గాలిని అందించాడు. చేతితో తడుతూ దాని కడుపులోని వ్యర్థాలను బయటకి తీశాడు. చల్లని నీరు ఉన్న బకెట్​లో పామును కొంత సమయం పాటు ఉంచాడు. చాలా సమయం శ్రమించి ఆ పాముకు జీవంపోశాడు సింగ్​.

"ఈ పాము విషపూరితమైంది కాదు. దీనిని చూసి ప్రజలు అనవసరంగా భయపడ్డారు. చాలా వేగంగా పరిగెత్తటం, నోటిని పైకి లేపటం వల్ల జనాలు పాముని చూసి భయపడతారు. జబల్​పూర్​కు చెందిన నిపుణుడు వివేక్​ శర్మతో నేను మాట్లాడాను. పాము పొట్టలో నీటిని పోయాలని ఆయన చెప్పారు. నీటిని పంపటం వల్ల దాని కడుపులోని ప్రమాదకర పదార్థాలు ఉంటే బయటకు వస్తాయన్నారు. నోట్లో స్ట్రా ద్వారా నీటిని పంపాను. నీటిని పంపిన తర్వాత పొట్టలోని పదార్థాలు బయటకు వచ్చాయి. ఈ ప్రక్రియ పాము సాధారణ స్థితికి రావడానికి ఉపయోగపడింది."

- షేర్​ సింగ్​, ఐటీ అధికారి.

ప్రమాదాలకు గురైన కొన్ని పాములను గతంలోనూ కాపాడినట్లు తెలిపారు సింగ్. పామును కాపాడినందుకు సింగ్​పై ప్రశంసలు కురిపించారు స్థానికులు.

ఇదీ చూడండి:రయ్​ రయ్​: బైక్​లపై కాశీ టు లండన్

ABOUT THE AUTHOR

...view details