తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏసీ కారులో వచ్చి.. ఎడ్లబండి ఎక్కారు! - damaged roads in palda

అసలే ఉరుకులు పరుగుల కాలమిది.. వేగంగా దూసుకుపోనిదే పని జరగదు. అందుకే, మన దగ్గర బైక్​, సైకిల్​ రెండూ ఉంటే ఆఫీసుకు వెళ్లాలన్నా, పాలప్యాకెట్​ తీసుకురావడానికైనా బైక్​నే ఎంచుకుని సమయం ఆదా చేసుకుంటాం. కానీ, మధ్యప్రదేశ్​లోని కొందరు వ్యాపారవేత్తలు మాత్రం ఖరీదైన కార్లను వదిలేసి.. ఎడ్లబండి ఎక్కి తమ కంపెనీలకు బయల్దేరారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అనుకుంటే పొరపాటే.. మరెందుకంటారా..? తెలుసుకోండి మరి..!

Indore industrialists ditch luxurious cars for bullock cart to protest bad roads
ఏసీ కారులో వచ్చి.. ఎడ్లబండి ఎక్కారు!

By

Published : Jun 8, 2020, 1:52 PM IST

మధ్యప్రదేశ్​లో కొందరు వ్యాపారవేత్తలు ఖరీదైన, విలాసవంతమైన కార్లను వదిలి... ఎడ్లబండెక్కారు. ఇందోర్​ పల్డాకు చెందిన ఆ వ్యాపారవేత్తలు.. అధ్వాన్నంగా మారిన రోడ్లను పునర్​నిర్మించాలని డిమాండ్​ చేస్తూ ఇలా నిరసన వ్యక్తం చేశారు.

ఏసీ కారులో వచ్చి.. ఎడ్లబండి ఎక్కారు!

ఎటు చూసినా గుంతలు, నీరు చేరుకుని దారుణంగా తయారైన రోడ్ల గురించి... తొమ్మిదేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవట్లేదని వాపోయారు వ్యాపారులు. మట్టి రోడ్డును తలపిస్తున్న ఈ మార్గంలో కార్లు నడవవనీ, ఎడ్లబండ్లు మాత్రమే నడుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏసీ కారులో వచ్చి.. ఎడ్లబండి ఎక్కారు!

ప్రభుత్వం సత్వర చర్యలు తీసకుని పల్డా మార్గంలో కొత్త రోడ్లు వేయించాలని కోరుతూ.. ఇలా ఎడ్లబండిపై కంపెనీలకు బయల్దేరారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది.

ఇదీ చదవండి:ఏనుగే ఆ బాంబు ఉన్న పండును ఆరగించిందా?

ABOUT THE AUTHOR

...view details