మోదీ సర్కార్ విదేశాంగ విధానం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ప్రతిష్ఠ మసకబారుతోందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రతి చోట గౌరవం కోల్పోతున్నామని, అయినా ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కావడం లేదని ట్వీట్ చేశారు.
చాబహర్ నౌకాశ్రయం నుంచి అఫ్గానిస్థాన్ సరిహద్దు వెంబడి ఉన్న జహదన్ ప్రాంతం వరకు రైల్వే మార్గాన్ని భారత్కు బదులుగా ఇరాన్ ప్రభుత్వమే సొంతంగానే నిర్మించాలనుకుంటోందన్న వార్తల్ని ప్రస్తావిస్తూ ఈ విమర్శలు చేశారు రాహుల్.
"భారత వీదేశీ వ్యూహం చిందరవందరగా ఉంది. మనం ప్రతి చోట గౌరవం, అధికారాన్ని కోల్పోతున్నాం. భారత ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియడం లేదు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత