తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌరులంతా సైనికులే.. అందరికీ సెల్యూట్​: మోదీ - మన్​ కీ బాత్ హైలైట్స్

కరోనా నేపథ్యంలో మన్​ కీ బాత్​ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనాపై పోరులో భాగస్వామ్యమైన పౌరులందరినీ సైనికులతో పోల్చారు మోదీ. దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు.

pm modi in mann ki Bhat
మన్​కీ బాత్​ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రం మోదీ

By

Published : Apr 26, 2020, 12:02 PM IST

కరోనాపై పోరు సవ్యమైన దిశలో సాగుతోందని మన్​ కీ బాత్ కార్యక్రమంలో చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పోరాటంలో ప్రతి పౌరుడు ఓ సైనికుడేనని తెలిపారు. కరోనాపై సమరానికి ప్రజలే నాయకత్వం వహిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. గల్లీ నుంచి దిల్లీ వరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ పాటిస్తున్నారన్నారు. కరోనాపై యుద్ధంలో ప్రపంచ దేశాలకు భారత్ స్ఫూర్తిగా నిలుస్తున్నట్లు చెప్పారు. కష్టకాలంలో ఎంతోమంది దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారన్నారు మోదీ.

కేంద్రం, రాష్ట్రాల సమన్వయం అద్భుతం

విపత్తు సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు ప్రధాని మోదీ. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు బాసటగా నిలిచారన్నారు. స్వచ్ఛ భారత్, శౌచాలయాల నిర్మాణాల్లోనూ ప్రజలు స్పందన అద్భుతమని కొనియాడారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు.

అనేక దేశాలకు ఔషధ సాయం

విపత్తు సమయంలో ప్రపంచ మానవాళి పట్ల భారత్​ మానవతా దృక్పథంతో వ్యవహరించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఔషధాలను అనేక దేశాలకు అందించినట్లు గుర్తుచేశారు. ఈ గొప్పతనమంతా భారతీయులదే అన్నారు.

మరిన్ని...

  • కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి
  • కార్మికులు, ఆటో డ్రైవర్లు సహా రోజువారీ ఆదాయంతో జీవించే వారి పరిస్థితి దయనీయంగా మారింది.
  • దయనీయంగా మారిన వారిని అన్ని విధాల ఆదుకుంటాం.
  • కరోనా వైరస్‌.. మన జీవితాల్లో అనేక మార్పులు తెచ్చింది
  • ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కరోనాను తరిమికొట్టాలి
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని దేశ ప్రజలంతా మానుకోవాలి
  • కరోనా కట్టడిలో ఆయుర్వేదం కూడా మంచి ఫలితాలను ఇస్తోంది
  • ప్రపంచమంతా మన యోగాను గుర్తించింది

ఇదీ చూడండి:'కరోనాపై పోరులో ఓర్పు, క్రమశిక్షణే కీలకం'

ABOUT THE AUTHOR

...view details