దేశంలో వరుసగా మూడోరోజూ రికార్డు స్థాయిలో కరోనా రికవరీల సంఖ్య పెరిగింది. దేశ వ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలోనే 34,602 మంది బాధితులు.. వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా రికవరీ రేటు 63.45 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా మరణాల రేటు కూడా 2.38 శాతనికి తగ్గిందని తెలిపింది.
శుక్రవారం నాటికి సుమారు 8 లక్షల 20 మంది మహమ్మారి నుంచి బయటపడగా.. మరో 4 లక్షల 40 వేల మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. నిత్యం పెరుగుతోన్న రికవరీ రేటు ఆధారంగా.. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్నవారే సుమారు 3 లక్షల 80 వేల మంది అధికంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.