తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వాతావరణ మార్పులతో.. పిల్లల ఆరోగ్యానికి పెను ముప్పు' - వాతావరణ మార్పులపై లాన్సెట్​ తాజా నివేదిక

వాతావారణ మార్పులతో పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని 'ది లాన్సెట్' తాజా నివేదిక పేర్కొంది. తక్షణం శిలాజ ఇంధన ఉద్గారాలను నియంత్రించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఆరోగ్యం, వాతావరణ మార్పులపై 'లాన్సెట్​ కౌంట్​డౌన్' 41 కీలక సూచీలతో సమగ్ర వార్షిక నివేదికను రూపొందించింది.

'వాతావరణ మార్పులతో.. పిల్లల ఆరోగ్యానికి పెను ముప్పు'

By

Published : Nov 14, 2019, 5:32 PM IST

వాతావరణ మార్పు... ఓ తరం పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని 'ది లాన్సెట్' తాజా​ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా భారతదేశంలో ఆహార కొరత, అంటువ్యాధులు, వరదలు, తీవ్ర ఉష్ణ తరంగాల కారణంగా పిల్లలు ఆనారోగ్యం పాలవుతున్నారని పేర్కొంది. తక్షణం శిలాజ ఇంధన ఉద్గారాలను నియంత్రించాల్సి ఉందని సూచించింది.

ఆరోగ్యం, వాతావరణ మార్పులపై 'లాన్సెట్​ కౌంట్​డౌన్' 41 కీలక సూచీలతో సమగ్ర వార్షిక నివేదికను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకుతో సహా 35 సంస్థలకు చెందిన 120 మంది నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు.

ప్రమాదం పొంచి ఉంది..

ప్రస్తుత రేటులోనే అధిక కర్బన ఉద్గారాలు వెలువడుతుంటే.. భూతాపం పెరిగిపోతుందని లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు తమ 71 ఏళ్ల వయస్సు నాటికి సగటున 4 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. ఫలితంగా వారి జీవితంలోని ప్రతి దశలోనూ ఆరోగ్య ముప్పు ఎదురవుతుందని స్పష్టం చేసింది.

భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్​ కన్నా తక్కువకు పరిమితం చేయాలన్న పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించకుంటే.. భావి తరాలు తీవ్ర ముప్పును ఎదుర్కోకతప్పదని లాన్సెట్ నివేదిక తేల్చిచెప్పింది. ఉష్ణోగ్రత పెరుగుదల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:అయోధ్య రామాలయం కోసం 2,100 కిలోల గంట

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details