భారత్‌కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అరేబియా సముద్రంలో మోహరించారు. సోమవారం నుంచి అరేబియా సముద్రంలో చైనా- పాకిస్థాన్‌లు సంయుక్తంగా తొమ్మిది రోజుల పాటు భారీ నావికాదళ విన్యాసాలు చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతలో భాగంగా భారత్ తన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను తీర ప్రాంతంలో మోహరించింది.
పాక్-చైనా యుద్ధ విన్యాసాల నేపథ్యంలో 'విక్రమాదిత్య' మోహరింపు - భారత్‌కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అరేబియా సముద్రం తీర ప్రాంతం
భారత్‌కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అరేబియా సముద్రం తీర ప్రాంతంలో మోహరించారు. సోమవారం నుంచి చైనా-పాకిస్థాన్‌లు సంయుక్తంగా అక్కడ నావికాదళ విన్యాసాలు చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మోహరించినట్లు నావికాదళ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులు తెలిపారు.
అరేబియా సముద్రంలోకి ఐఎన్ఎస్ విక్రమాదిత్య
మిగ్ 29కె యుద్ధ విమానంతో కూడిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యను వ్యూహాత్మక మిషన్‌లో భాగంగా పంపినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ వాహక నౌకను మోహరించే సమయంలో నావికాదళ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులు అందులో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: గెజిట్ నోటిఫికేషన్తో అమల్లోకి వచ్చిన సీఏఏ
TAGGED:
ఐఎన్ఎస్ విక్రమాదిత్య