తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొవిడ్​ టీకా కంటే ముందే హెర్డ్‌ ఇమ్యూనిటీ' - హెర్డ్ ఇమ్యూనిటీ

కరోనా టీకా రావడానికి ముందే దేశ ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీని పొందుతారని ఎయిమ్స్​ డైరెక్టర్​ రణదీప్​ గులేరియా వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరికీ టీకా అందించడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్​ అని పేర్కొన్నారు.

Randeep Guleriya
కొవిడ్​ టీకా కంటే ముందే హెర్డ్‌ ఇమ్యూనిటీ!

By

Published : Nov 15, 2020, 6:50 AM IST

కొవిడ్-19 టీకా అందుబాటులోకి రావడానికి కంటే ముందే దేశ ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీని పొందే అవకాశం ఉందని తాజాగా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. 'మేము మంచి రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నామన్న దశకు మనం చేరుకోవచ్చు. అప్పుడు టీకా ప్రయోజనం ఉండదు. కాకపోతే ఒక సమస్య ఉంది. వైరస్ మార్పులు చెందితే..రీ ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో వైరస్‌ స్పందించే తీరుపై మేం అంచనా వేస్తున్నాం. దాని ఆధారంగా ఎంత తరచుగా టీకా తీసుకోవాల్సి ఉంటుందో అర్థమవుతుంది' అని వెల్లడించారు.

ఇక, ప్రపంచ వ్యాప్తంగా చివరి దశ ప్రయోగాలు జరుపుకొంటున్న పలు కంపెనీల టీకాలకు ఈ ఏడాది చివర్లోకానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఆమోదం లభించే అవకాశం ఉంది. అయితే, అధిక జనాభా కలిగిన మనదేశంలో ప్రతి ఒక్కరికి టీకాను అందించడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. టీకా పంపిణీకి సంబంధించి కేంద్రం ఇప్పటికే కార్యచరణను సిద్ధం చేస్తోంది.

ఇదీ చదవండి:ముగ్గురు పిల్లలతో కాలువలో దూకిన తల్లి

ABOUT THE AUTHOR

...view details