ప్రఖ్యాత భారతీయ సైకత కళాకారుడు పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. బోస్టన్‌లో నిర్వహించిన '2019 రివర్ బీచ్ అంతర్జాతీయ సైకత శిల్ప ఉత్సవం'లో సుదర్శన్‌కు 'పీపుల్స్ ఛాయిస్' అవార్డు వరించింది. ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 15 మంది అగ్రశ్రేణి సైకత కళాకారులను ఎంపికచేయగా వారిలో సుదర్శన్ పట్నాయక్ ఒకరు.
సముద్రాల్లో ప్లాస్టిక్ కాలుష్యంపై రూపొందించిన సైకత శిల్పానికి సుదర్శన్ ఈ అవార్డు పొందారు. ‘'ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఆపండి, సముద్రాలను కాపాడండి'’ అనే సందేశంతో సైకతశిల్పాన్ని రూపొందించారు పట్నాయక్.
"ఇది నాకు చాలా పెద్ద గౌరవం, ఈ అవార్డు భారతదేశానికి దక్కింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించే విషయంలో భారత్ చాలా కృషిచేస్తోంది. "
- సుదర్శన్ పట్నాయక్, సైకత శిల్పి.