స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా సరిహద్దు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. భారత్-పాక్ నియంత్రణ రేఖ వద్ద గస్తీని పెంచారు.
నియంత్రణ రేఖ వద్ద భద్రత మరింత పటిష్ఠం పాకిస్థాన్ నేడు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంది. రేపు భారత్లో వేడుకలు మిన్నంటనున్నాయి.
370 అధికరణ రద్దుతో కశ్మీర్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మోదీ సర్కారు పలు ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ విధింపుతో కశ్మీర్ లోయలో ప్రజలు 9వ రోజు ఇళ్లకే పరిమితమయ్యారు. దేశ స్వాతంత్ర్య వేడుకల తర్వాత ఆంక్షలు కాస్త సడలించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పాక్ వేడుకలు...
పాకిస్థాన్ 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. దిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోనూ ఈ వేడుకలు జరిగాయి. ఆగస్టు 14ను కశ్మీరీ సంఘీభావ దినంగా ప్రకటించింది పాకిస్థాన్. ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పంపిన సందేశాన్ని వారి హైకమిషనర్ చదివి వినిపించారు.
"కశ్మీరీ సోదరులకు ఈ సందర్భంగా మరోసారి హామీ ఇస్తున్నాం. పాకిస్థాన్ మీకు రాజకీయ, నైతిక, న్యాయపరమైన మద్దతును కొనసాగిస్తుంది. మీరు మీ అస్థిత్వం కోసం పోరాడండి."
- పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సందేశం