భారత్, శ్రీలంక సంయుక్తంగా నౌకదళ విన్యాసాలు 'స్లినెక్స్-20' నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి. శ్రీలంకలోని ట్రింకోమలీలో ఈ నెల 19-21 మధ్య ఈ విన్యాసాలు జరుగునున్నాయి. ఇంటర్-ఆపరేటబిలిటీ, పరస్పర అవగాహన, బహుముఖ సముద్ర కార్యకలాపాల కోసం ఉత్తమ పద్ధతులు, విధానాలను మార్పిడి చేయడం లక్ష్యంగా ఈ ప్రదర్శనలను నిర్వహించనున్నారు.
ఈ విన్యాసాల్లో దేశీయంగా నిర్మించిన యుద్ధనౌకలు, విమానాల సామర్థ్యాల్ని ప్రదర్శించనున్నారు. గన్ ఫైరింగ్, సీమన్‌షిప్, క్రాస్ డెక్ ఫ్లయింగ్ కార్యకలాపాలతో సహా పలు ఉపరితల, యాంటీ ఎయిర్ కసరత్తులు ఈ ఏడాది విన్యాసాల్లో భాగం కానున్నాయి. గత ఏడాది స్లినెక్స్-19 నావికా దళ విన్యాసాలు విశాఖపట్నంలో నిర్వహించారు.
భారత్ తరఫున..