తీరప్రాంత భద్రతను మరింత బలోపేతం చేసేందుకు 6 అణు జలాంతర్గాములతో సహా 24 జలాంతర్గాములను నిర్మించాలని భారత నావికా దళం ప్రణాళికలు రూపొందిస్తోంది. వీటిలో 18 సంప్రదాయ సబ్ మెరైన్లను నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రైవేటు రంగ పరిశ్రమల భాగస్వామ్యంతో స్వదేశంలోనే జలాంతర్గాములను సిద్ధం చేస్తోంది నేవీ.
6 అణు జలాంతర్గాములను నిర్మించే యోచనలో నేవీ - తాజా నావికా దళం వార్తలు
సముద్రంలో భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా భారత నావికా దళం ముందడుగేసింది. 18 సంప్రదాయ జలాంతర్గాములతో పాటు మరో ఆరు 6 అణు జలాంతర్గాములను నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది.
6 అణు జలాంతర్గాములను నిర్మించే యోచనలో నేవీ
ప్రస్తుతం భారత్ వద్ద 15 సంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. రష్యా నుంచి లీజుకు తీసుకున్న ఐఎన్ఎస్ చక్రా సహా 2 అణు జలాంతర్గాములూ ఉన్నట్లు.. ఈ నెలలో ఓ నివేదికలో తెలిపింది నేవీ.
సంప్రదాయ జలంతర్గాముల్లో ఎక్కవ శాతం 25 ఏళ్లు పైబడినవని, మరో 13 మెరైన్లు 17 నంచి 32 సంవత్సరాల నాటివని నేవీ తెలిపింది. అంతే కాకుండా 'ప్రాజెక్ట్ 75 ఇండియా' లో భాగంగా మరో 6 కొత్త జలాంతర్గాములను నిర్మించాలని భావిస్తోంది నేవీ.