హర్షిణి అనే ఆడ చిరుత దాని సొంత నవజాత పిల్లనే మింగేసింది. బంగాల్లోని ఝార్గ్రామ్ (జంగిల్ మహల్) జంతుప్రదర్శన శాలలో ఈ ఘటన జరిగింది. 82 రోజుల వయసున్న సొంత పిల్లనుహర్షిణి అనే చిరుత చంపి తినేసినట్లు జూ సూపరింటెండెంట్ బసవరాజ్ హోలెచ్చి ధ్రువీకరించారు.
ఖైర్బడి పులుల సంరక్షణ కేంద్రం నుంచి హర్షిణిని 2019లో ఝార్‌గ్రామ్‌కు తీసుకొచ్చారు. కొద్ది రోజుల పాటు సొహైల్ అనే మగ చిరుత ఎన్‌క్లోజర్‌లో దీనిని ఉంచారు. గర్భం దాల్చినట్లు గుర్తించిన అధికారులు హర్షిణిని వేరే ఎన్‌క్లోజర్‌లోకి మార్చారు.